30, అక్టోబర్ 2009, శుక్రవారం

బ్రహ్మ పుత్రుడా !


ద్విజుడవో దేవుడివో
ఎవడిక్కావాలి నువ్వేవడో...

డాంబికాల డింభకులకు
విద్వత్తులేని వేషధారులకు...

దాస్యం చేస్తున్న ధారుణి పై
బ్రతకపోరుతున్న బ్రాహ్మికుడా...

కత్తుల కళాకారులతో
ఎరుపెక్కిన రంగస్థలంపై...

అప భ్రంశ మేధల
లాస్య విన్యాసాలలో...

వేద పాఠాలెందుకు వెర్రివాడా
పురహితం కోరే పిచ్చివాడా!!



21, అక్టోబర్ 2009, బుధవారం

వేడుక


విశ్వంభర... విధాత
విధిగా వేస్తున్న నాటిక..

పాత్రలు మారుస్తూ
మనకు కలిగిస్తున్నాడు వేడుక..

కృశిస్తున్న కాయాన్ని
కాష్ఠ కర్మాగారాన కరిగించి..

గర్భ గృహంలో
పోత పోసిన నవ రూపంతో..

నాంది పలికి
తృటిలో మారుస్తూ కధనం..

అనంతంగా సాగుతోంది ఈ విభు కవనం !!

కృతజ్ఞత


ఏదో తెలుగు లో
వ్రాసేద్దామని కాదు...

ఈ ఆంగ్ల తుఫానులో
కొట్టుకుపోకుండా
మాతృభాషను మర్చిపోకుండా...

ఓ నా మః లు నేర్పిన తెలుగుతల్లికి
నా కృతజ్ఞతా భూషణం...

ఈ పూర్ణభుషణం!!


పూర్ణభుషణం


ప్రీతి మధనం

నవనీత లేపనం...

యుగంధర కవనం

విభు భాష్యం...

ఈ పూర్ణభుషణం !!